Monday, January 10, 2011

మధురం మధురం..

మామూలుగా సినిమాలో పాటలు అందరు రచయితలూ రాసేస్తారు కానీ ఈ పాట చూడండి "మధురాష్టకం" తీసుకుని చిన్న చిన్న మార్పులతో ఇలా అందమయిన సినిమా పాటగా మలచవచ్చన్న "వేటూరి" ఊహే అద్భుతంగా ఉంది.

"షాక్" సినిమాలోని ఈ పాట ని వీక్షించండి.


 
ఆ పాట సాహిత్యం ఇక్కడ.
చిత్రం: షాక్
గానం: బాలు,చిత్ర
రచన: వేటూరి
సంగీతం: అజయ్-అతుల్ 
  
మధురం మధురం..మధురం మధురం, 
మధురం మధురం..మధురం మధురం,
ప్రణయం మధురం కలహం మధురం, 
క్షణమో సగమో విరహం మధురం, 
సరసం మధురం విరసం మధురం, 
చికురం మధురం చుబుకం మధురం, 
సరసం మధురం విరసం మధురం, 
చికురం మధురం చుబుకం మధురం, 
  
అందం అందం అని ఊరించించే అందాలన్నీ అసలే మధురం,  
శ్రవణం మధురం నయనం మధురం, 
కులుకే మధురం కురులే మధురం, 
గమనం మధురం జఘనం మధురం,  
లయలో సాగే పయనం మధురం,  
గమనం మధురం జఘనం మధురం, 
లయలో సాగే పయనం మధురం,
ఎదరే వుంటే అదిరే మధురం,
చెదిరే జుట్టు చమటే మధురం,
 
సర్వం మధురం సకలం మధురం, 
సంసారంలో సాగర మధనం,
సర్వం మధురం సకలం మధురం, 
సంసారంలో సాగర మధనం, 
అన్నీ మధురం అఖిలం మధురం, 
ఆమే మధురం ప్రేమే మధురం, 
అన్నీ మధురం అఖిలం మధురం,
ఆమే మధురం ప్రేమే మధురం, 
కనులే మధురం కలలే మధురం,
కొంచం పెరిగే కొలతే మధురం,

కనులే మధురం కలలే మధురం,
కొంచం పెరిగే కొలతే మధురం,
మనసే మధురం సొగసే మధురం,
విరిసే పెదవుల వరసే మధురం.
   
ఉదయం దాచే మధురిమ గారి ఉదరం మధురం హృదయం మధురం,
 
తాపం మధురం శోకం మధురం,
అలకే చిలికే కోపం మధురం,
అలుపే మధురం సలుపే మధురం,
అతిగా మరిగే పులుపే మధురం,
 
అలుపే మధురం సలుపే మధురం,
అతిగా మరిగే పులుపే మధురం,
అధరం మధురం యెదనం మధురం
పెరిగి చిరిగి తిలకం మధురం,
బాలా మధురం డోలా మధురం,
లీలా మధురం హేలా మధురం, 
బాలా మధురం...మధురం...మధురం...
డోలా మధురం...మధురం...మధురం...
లీలా మధురం హేలా మధురం,
జో జో మధురం...మధురం..
జోలా మధురం...మధురం..
మనువాటకిదే మధురం మధురం
ఆ...ఉమ్మ్.ఉమ్మ్...
మధురం మధురం ప్రణయం మధురం,
మధురం మధురం విరహం మధురం,
సరసం మధురం విరసం మధురం,
నయనం మధురం వదనం మధురం,
సరసం మధురం విరసం మధురం,
నయనం మధురం వదనం మధురం,
అన్నీ మధురం అఖిలం మధురం మనమే మధురం ప్రేమే మధురం.

1 comment:

  1. వేటూరి classical కి modern కి మధ్య వారధి అండి. ఆయన ఊహాశక్తి అమోఘం.

    ReplyDelete